KCR, హరీశ్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్, సిఫార్సుల ఆధారంగా CBI విచారణ చేపట్టొద్దంటూ ప్రధాన న్యాయమూర్తి(CJ) అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియొద్దీన్ బెంచ్ ఆదేశించింది. ఆ ఇద్దరి మధ్యంతర పిటిషన్లకు విచారణార్హత లేదని అడ్వొకేట్ జనరల్(AG) వాదించారు. ఘోష్ నివేదిక కాకుండా NDSA రిపోర్ట్ ఆధారంగానే విచారణకు సర్కారు ఆదేశించిందన్నారు. తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దన్న న్యాయస్థానం.. విచారణను అక్టోబరు 7కు వాయిదా వేసింది.