ఓట్ల చోరీ అంటూ ఎన్నికల సంఘంపై రాహుల్(Rahul) విరుచుకుపడుతుంటే.. ఇలాంటి అంశంలోనే ఇరుక్కున్నారు కాంగ్రెస్ కీలక నేత. పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేడా(Khera)కు ఢిల్లీలో రెండు ఓట్లున్నాయని EC గుర్తించింది. 1950 ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఈనెల 8వ తేదీ 11 గంటల్లోపు వివరణివ్వాలని నోటీసులిచ్చింది. కేంద్రానికి మద్దతుగా నిలవడం ECకి అలవాటైందని ఖేడా ఎదురుదాడి చేశారు. కర్ణాటక మహదేవపుర సెగ్మెంట్లో లక్ష దొంగ ఓట్లపై ఏం చెబుతారంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.