కల్వకుంట్ల కవిత వివాదంపై CM రేవంత్, కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏ పార్టీని బతకనీయం అని చెప్పి ఎవరికి వాళ్లు తన్నుకుంటున్నారంటూ రేవంత్ విమర్శించారు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవని, అలాంటి వాళ్లను పట్టించుకునే అవసరం తనకు లేదన్నారు. ఆమె రాజీనామా చేస్తే ఏంది, చేయకుంటే ఏంది అంటూ సంజయ్ తేలిగ్గా కొట్టిపడేశారు. వారితో తెలంగాణకేమైనా ఉపయోగం ఉందా అని ప్రశ్నించారు. ఇక కవితను ప్రజాశాంతి పార్టీలోకి కె.ఎ.పాల్ ఆహ్వానించారు. నిజంగా BCలపై ప్రేముంటే తమ పార్టీలోకి రావాలని, అలా చేస్తే జూబ్లీహిల్స్ టికెటిస్తానన్నారు.