కాలకూట విషమున్న పార్టీ BRS అని, దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని CM రేవంత్ అన్నారు. గృహనిర్మాణ శాఖను వద్దనుకోవడానికి గల కారణాన్ని ఇందిరమ్మ ఇళ్ల అమలు కార్యక్రమంలో తెలియజేశారు. KCR సంగతి చూడటానికి తనకు టైం ఉండదు కాబట్టే ఆ శాఖను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించానన్నారు. తన కుటుంబానికి KCR ఫాంహౌజ్ లు, లక్ష కోట్లు, వ్యాపారాలు, పేపర్లిచ్చారని.. కానీ ప్రశాంతత, ఆనందం ఇవ్వగలిగారా అని గుర్తు చేశారు. BRS అనే పామును ఎప్పుడో చంపేశారని, చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరముందా అన్నారు.