భగీరథ నీళ్లు రావట్లేదని ఎవరైనా కంప్లయింట్ (Complaint) ఇస్తే అధికారులను ఆడవాళ్లతో తన్నిస్తానని డోర్నకల్ MLA రెడ్యానాయక్ కామెంట్ చేశారు. అన్ని శాఖల అధికారులు, పార్టీ నేతలు, ప్రజలతో కలిసి తన సెగ్మెంట్ లోని గొల్లచర్లలో మీటింగ్ పెట్టారు. డోర్నకల్ మండలంలో ఈ నెల 28 నుంచి మొదలు కానున్న ‘పల్లె పల్లెకూ రెడ్యానాయక్’ ప్రోగ్రాంలో భాగంగా ఈ మీటింగ్ నిర్వహించారు. తమకు నీళ్లు రావడం లేదని కొందరు MLAకు చెప్పగా రిపేర్ల కోసం రూ.5 లక్షలు ఇచ్చి నాలుగు నెలలు అవుతున్నా పనులు పూర్తి కాకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. అధికారులు ఇలా చేస్తే తమకు ప్రజలు ఎలా ఓట్లేస్తారంటూ అసహనం వ్యక్తం చేశారు.
తన టూర్ మొదలయ్యే లోపే పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని, మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని ఎవరైనా కంప్లయింట్ ఇస్తే బాధ్యులైన అధికారులను ఆడవాళ్లతోనే తన్నిస్తానని హెచ్చరించారు. రెడ్యానాయక్ ఇలా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. అందరి ముందు అలా అనడంతో అధికారులు చిన్నబోయారు.