మహిళా IPSను ఉప ముఖ్యమంత్రి బెదిరించిన ఘటన వైరలైంది. అక్రమ మట్టి తవ్వకాల్ని ఆపిన అంజన కృష్ణకు మహారాష్ట్ర డిప్యూటీ CM అజిత్ పవార్ ఫోన్లో వార్నింగ్ ఇచ్చారు. ‘నేను ఉపముఖ్యమంత్రిని.. దాన్ని ఆపాలి.. మీపై చర్యలు తీసుకుంటా.. నన్ను చూడాలనుందా.. నంబర్ ఇవ్వు.. వాట్సాప్ లో కాల్ చేస్తే నా ముఖాన్ని గుర్తు పడతావ్.. ఎంత ధైర్యం..’ అన్న వీడియో సంచలనమైంది. కార్యకర్తల్ని శాంతింపజేయడానికి పవార్ అలా చేశారని NCP అంటోంది. కేరళ తిరువనంతపురం వాసి అంజన మహారాష్ట్ర కేడర్లో ఈ మధ్యే చేరి సోలాపూర్ జిల్లా కర్మాలా SDPOగా పనిచేస్తున్నారు. 2022 బ్యాచ్ కు చెందిన ఆమె ర్యాంకు 355.