ఎప్పుడేం మాట్లాడుతారో అర్థం కాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి అలాగే ప్రవర్తించారు. భారత్ ను దూరం చేసుకున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మేం భారత్, రష్యాను అత్యంత దూరం చేసుకున్నాం.. చైనాను కూడా.. ఆ మూడు దేశాలకు మంచి భవిష్యత్తు ఉండాలి..’ అంటూ చైనా SCO సదస్సులోని మోదీ-పుతిన్-జిన్ పింగ్ ఫొటోను పెట్టారు. అగ్రరాజ్యంపై స్వదేశీయులే విమర్శలు చేయడం, ఆర్థిక వ్యవస్థ దిగజారి క్రమంగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో అయోమయం ఏర్పడింది. అయితే ట్రంప్ నిజంగానే ఆవేదనతో పోస్ట్ పెట్టారా, లేక నాటకమా అన్నది తేలాలి.