పిల్లల్లో ఆత్మ విశ్వాసం, వ్యక్తిత్వ వికాసానికి చేతిరాతే కీలకమని భావించారు కరీంనగర్(Karimnagar) కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వ బడుల్లో పోటీలు నిర్వహించారు. తొలుత పాఠశాల, ఆ తర్వాత మండల స్థాయిల్లో ముగ్గురేసి చొప్పున ఎంపిక చేశారు. 16 మండలాల నుంచి జిల్లా స్థాయికి 48 మంది వచ్చారు. ఈరోజు వారికి రాతపరీక్ష పూర్తికాగా, విజేతలకు 15న అవార్డులందిస్తారు. 2 విభాగాల్లో ఇద్దరికి ప్రథమ బహుమతి కింద రూ.5 వేల చొప్పున అందిస్తారు. https://justpostnews.com
సెకండ్ ప్రైజ్ కింద ఇద్దరికి రూ.4 వేల చొప్పున, థర్డ్ ప్రైజ్ గా ఇద్దరికి రూ.3 వేల చొప్పున అందజేస్తారు. నాలుగు, ఐదు బహుమతులుగా రూ.2 వేలు, రూ.వెయ్యిని ఇద్దరేసి చొప్పున అందుకుంటారు. ప్రతి విభాగంలో ఐదుగురికి కన్సోలేషన్, మండల స్థాయిలో ఎంపికైన ముగ్గురికి సర్టిఫికెట్లు ఇస్తారు. కలెక్టర్ పమేలాతోపాటు ఉన్నతాధికారులు, ఉద్యోగులు సైతం పోటీల్లో పాల్గొన్నారు.