నోయిడాకు చెందిన సచిన్ మీనా.. పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ స్టోరీలు సద్దుమణగక ముందే మరో కొత్త కథ వెలుగులోకి వచ్చింది. ఇదో కొత్త ‘లవ్ స్టోరీ’గా అనుమానిస్తున్నారు అధికారులు. అసలేం జరిగిందంటే….
ఆమె పేరు అంజు.. వయసు 35 ఏళ్లు.. పెళ్లయి భర్త అరవింద్ కుమార్ తో కలిసి ఉంటోంది. ఇద్దరు పిల్లలతో సంసారం సాఫీగా సాగుతున్న వేళ.. నాలుగేళ్ల నాడు ఫేస్ బుక్ లో ఆ లేడీకి పాకిస్థాన్ వాసితో పరిచయం ఏర్పడింది. అలా ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసి ఉండవచ్చు. అసలు కథ ఇలా ఉంటే… టూర్ కోసం జైపూర్ వెళ్తున్నానని చెప్పి జులై 20న ఆ వివాహిత ఇంట్లో నుంచి బయల్దేరింది. పాపం భర్త కూడా ఆమె జైపూరే వెళ్తుంది అనుకున్నాడు. కానీ ఆమె అడుగుపెట్టింది పాకిస్థాన్ లో. అసలు విషయమేంటంటే తాను కాలు పెట్టింది.. ఎప్పుడూ కల్లోల పరిస్థితులు, ఉగ్రవాదంతో భయానక పరిస్థితులుండే ఖైబర్ పంక్తుఖ్వాలో. దాయాది దేశానికి చెందిన సీమా హైదర్ నేపాల్ నుంచి ఇల్లీగల్ గా ఇండియాలోకి అడుగుపెడితే.. అంజు మాత్రం అఫీషియల్ గా పాక్ కు చేరింది. ఈ విషయంపైనే రాజస్థాన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. అంజు పాకిస్థాన్ ఎందుకు వెళ్లింది.. ఖైబర్ పంక్తుఖ్వా లాంటి కరడుగట్టిన ఏరియాకు వెళ్లడానికి గల కారణాలపై రీసెర్చ్ మొదలుపెట్టారు.
అంజు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా, ఆమె భర్త అరవింద్ మరో చోట డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. రాజస్థాన్ అల్వార్ లోని భివాండి ప్రాంతంలో ఈ జంట రెంట్ కు ఉంటోంది. భర్తకు తెలియకుండానే అలా ఫేస్ బుక్ ఛాటింగ్ వ్యవహారం నడిపిస్తూనే ఉంది. మూడేళ్ల క్రితం ఆమె పాస్ పోర్టుకు అప్లై చేసింది. ఎందుకు అని భర్త అడిగితే.. ఫ్యూచర్ లో ఫారిన్ నుంచి మంచి జాబ్ ఆఫర్ వస్తుంది.. ఇప్పుడే పాస్ పోర్టు తీసుకుంటే మంచిది అని నమ్మించింది. ఆ అరవింద్ అదంతా నిజమని నమ్మాడు. మూడేళ్ల క్రితం పాస్ పోర్టు తీసుకుంది. మరోవైపు భర్తకు చెప్పకుండానే ఈ ఏడాది మే 4న వీసా కూడా తీసుకుంది. ఇంకేముంది… జైపూర్ టూర్ కని చెప్పి ఈ నెల(జులై) 20 నాడు అంటే నాలుగు రోజుల క్రితం అంజు పాకిస్థాన్ కు చేరుకుంది.
ఇక రాజస్థాన్ ఆఫీసర్స్ టీమ్.. ఈనెల 23(ఆదివారం)నాడు భివాండిలోని అంజు ఇంటికి వచ్చి అరవింద్ ను వివరాలు అడిగింది. ఆమె పాకిస్థాన్ కు ఎందుకు వెళ్లింది.. వీసా ఎవరు పంపారు.. అని అడగడంతో అవాక్కవడం అరవింద్ వంతయింది. పాకిస్థాన్ ఏంటి.. అంజు వెళ్లడమేంటి అనుకుంటూ నోటి నుంచి ఒక్కసారిగా మాట ఆగిపోయింది. అప్పుడు ఆ ఆఫీసర్స్ జరిగిందంతా ఆమె భర్తకు డీటెయిల్డ్ గా చెప్పారు. నస్రుల్లా(29) అనే వ్యక్తిని మీట్ అయ్యేందుకు అంజు 30 రోజుల వీసా తీసుకుని పాక్ కు వెళ్లిందని చెప్పడంతో అరవింద్ షాక్ తిన్నాడు. అంటే ఆమె 20 నాడు బోర్డర్ దాటిన విషయం 23 నాడు భర్తకు తెలిసిందన్నమాట. అంజు పాకిస్థాన్ చేరుకున్న విషయాన్ని ఖైబర్ పంక్తుఖ్వా ఏరియా పోలీస్ స్టేషన్ SHO జావెద్ ఖాన్ కన్ఫర్మ్ చేశాడు. భివాండిలో ఉంటున్న అంజు-అర్వింద్ అసలు రాష్ట్రాలు వేరు. ఆమెది మధ్యప్రదేశ్ లోని టేకంపూర్ కాగా, భర్తది ఉత్తర్ ప్రదేశ్ లోని బాలియా అని భివాండి అడిషనల్ ఎస్పీ సుజిత్ శంకర్ తెలిపారు. ఇలా వేరు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు జంటగా ఇంకో చోట ఉండటం, అనూహ్యంగా ఆమె పాకిస్థాన్ కు వెళ్లడంతో ఈ ఇష్యూ మన దేశ ఇంటెలిజెన్స్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మేం క్రిస్టియన్స్. కాబట్టి ఇది హిందూ-ముస్లిం లవ్ స్టోరీగా ప్రచారం చేయొద్దంటూ అంజు భర్త అరవింద్ వేడుకుంటున్నాడు. నేను తిరిగివస్తానంటూ అంజు మాట ఇచ్చిందని, ఆ మాట ప్రకారం కచ్చితంగా తన దగ్గరకు వస్తుందన్న నమ్మకముందని ఆఫీసర్స్ తో చెప్పాడు అరవింద్.
Good information