
హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నాచారం, మల్లాపూర్, చందానగర్, కొండాపూర్, హిమాయత్ నగర్, మెహిదీపట్నం, దిల్ సుఖ్ నగర్, సికింద్రాబాద్, బొల్లారం, మారేడ్ పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో రోడ్లన్నీ వాటర్ తో నిండిపోయాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అటు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
వాహనదారులంతా ఎక్కడికక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఇప్పటికే GHMC అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని చెబుతున్నా, చాలా చోట్ల నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఏర్పడితే 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని GHMC మేయర్ విజయలక్ష్మీ సూచించారు.