అన్నీ మంచి శకునములే…
డైరెక్టర్ నందినీరెడ్డి తెరకెక్కించిన సినిమా “అన్నీ మంచి శకునములే’. ఫ్యామిలీ స్టోరీతో వచ్చిన ఈ మూవీ ఎమోషనల్ గా అందరినీ అట్రాక్ట్ చేసి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమాగా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ లో జూన్ 17 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. సంతోష్ శోభన్, మాళవిక మెయిన్ రోల్స్ చేసిన ఈ మూవీని ఓటీటీలో నాలుగు భాషలో చూడొచ్చు.
ఈనెల 18 నుంచి బిచ్చగాడు-2
విజయ్ ఆంటోని, కావ్య థాపర్ నటించిన బిచ్చగాడు-2 జూన్ 18 నుంచి ఓటీటీల్లో రెడీగా ఉంటుంది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మే చివర్లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సిస్టర్ సెంటిమెంట్ తో కూడిన ఈ సినిమా తెలుగు, తమిళంలో హిట్ కొట్టింది. డిస్నీ+హాట్ స్టార్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దీన్ని చూడొచ్చు.
జూన్ 23 నుంచి ఇంటింటి రామాయణం
సినీ ప్రియుల్ని అలరించేందుకు ఈ వారం ఓటీటీల్లో మూవీలు వచ్చేస్తున్నాయి. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఇంటింటి రామాయణం ఇప్పుడు ఓటీటీలకు చేరింది. జూన్ 23 నుంచి “ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేశ్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
నాగచైతన్య కస్టడీ వచ్చేసింది…
వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య, కృతిశెట్టి జోడీగా నటించిన సినిమా “కస్టడీ’. తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ సినిమా మే 12న విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో జూన్ 9 నుంచి “కస్టడీ’ నడుస్తోంది. దక్షిణాదిలోని నాలుగు లాంగ్వేజీల్లో సినిమా చూడొచ్చు.