
ఇప్పటిదాకా విర్రవీగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దిగివస్తున్నారు. 50% సుంకాలైనా తగ్గకపోవడం, రష్యాతో ఆయిల్ కొనుగోళ్లు పెంచడం, చైనాతో భారత్ బంధం బలపడటంతో స్వరం మార్చారు ట్రంప్. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు పోవడానికి చర్చలు కొనసాగుతాయని ప్రకటిస్తున్నా.. నా మంచి మిత్రుడు మోదీతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నా.. రెండు గొప్ప దేశాల మధ్య విజయవంతమైన ముగింపునకు ఇబ్బంది ఉండదు..’ అని తన సామాజిక మాధ్యమమైన ‘ట్రూత్ సోషల్(Truth Social)’లో పోస్ట్ చేశారు.