గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద TGPSC సమాలోచనలు జరుపుతోంది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలతో చర్చించాకే తదుపరి నిర్ణయం రానుంది. డివిజన్ బెంచా లేక సుప్రీంలో సవాల్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. తీర్పు కాపీని అధ్యయనం చేశాకే న్యాయనిపుణుల సలహా తీసుకోవాలన్న భావన ఉంది. పునర్ మూల్యాంకనం(Re-Valuation) చేపట్టడం, సాధ్యం కాకపోతే మరోసారి మెయిన్స్ నిర్వహించాలన్న రెండు ఆప్షన్స్ ఇచ్చి ప్రక్రియ మొత్తం 8 నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.