పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మృతి కేసులో కోర్టులోనే రచ్చ జరిగింది. రూ.30 వేల కోట్ల ఆస్తులపై ఆయన ప్రస్తుత, మాజీ భార్యలు జడ్జి ఎదుటే వాదులాటకు దిగారు. సంజయ్ కి 3 పెళ్లిళ్లు కాగా, లండన్ లో గుండెపోటుతో మరణించారు. రెండో భార్య కరిష్మ, మూడో భార్య ప్రియకు ఇద్దరేసి పిల్లలున్నారు. ఆస్తుల్లో తమ వాటా రావాలంటూ కరిష్మ పిల్లలు కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో విచారణ సాగుతుండగా.. కరిష్మపై ప్రియ విరుచుకుపడ్డారు. ‘ఆయనకు నేనే అసలైన భార్యని.. నిన్ను చాలా కాలం క్రితమే విడిచిపెట్టారు.. సుప్రీంకోర్టుకు వెళ్లి విడాకుల కోసం కొట్టుకున్నప్పుడు ఇవన్నీ ఏమయ్యాయి..’ అంటూ వాగ్యుద్ధానికి దిగారు.