ప్రభుత్వ విద్యాలయాల్లో ACB తనిఖీలకు దిగింది. లీగల్ మెట్రాలజీ, శానిటరీ-ఫుడ్ ఇన్స్ పెక్టర్లు, ఆడిటర్ తో కలిసి ఆకస్మిక సోదాలు చేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రం సాయికుంటలోని ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ హైస్కూల్ తోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి KGBVని పరిశీలించింది. పిల్లల రూంలు, వంటగదిలో అపరిశుభ్రత, బాత్రూంల్లో దుర్గంధం, క్యాష్ బుక్ లో అప్డేషన్ లేకపోవడాన్ని గుర్తించింది. ఈ రెండు జిల్లాల్లోని తమ యూనిట్ల ఆధ్వర్యంలో దాడులకు దిగినట్లు ప్రకటించిన ACB.. తగిన చర్యల కోసం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని తెలిపింది.