భారత రాజ్యాంగంపై సుప్రీంకోర్టు(Supreme Court) ప్రశంసలు కురిపించింది. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద బిల్లుల పెండింగ్ పై చర్చ సందర్భంగా.. నేపాల్, బంగ్లాదేశ్ ఘటనల్ని న్యాయమూర్తులు ప్రస్తావించారు. వారి మాటల్లోనే…
సీజేఐ గవాయ్…: ‘మన పొరుగు దేశాల్లో ఏం జరుగుతుందో చూడండి.. నేపాల్ ను చూస్తున్నాం.. అవినీతిపై యుద్ధంతో 48 గంటలుగా అల్లర్లే.. మన రాజ్యాంగం చూస్తే గర్వంగా ఉంది..’
జస్టిస్ విక్రమ్ నాథ్…: ‘అవును, బంగ్లాదేశ్ కూడా.. ఏడాది క్రితం విద్యార్థుల దిగ్భ్రాంతికర హింసతో 100 మంది చనిపోయారు.. ఈ దాడులతో ప్రధాని షేక్ హసీనా పారిపోయారు.. చివరకు నోబెల్ గ్రహీత యూనస్ తో పరిపాలన నడుస్తోంది.. బంగ్లా, నేపాల్ సారూప్యతల్ని కొట్టిపడేయలేం.. చట్టపాలన, రాజ్యాంగ విచ్ఛిన్నం వల్లే అలా జరిగింది..’
SG తుషార్ మెహతా…: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు నెల రోజుల పాటు బిల్లుల్ని రిజర్వ్ చేయవచ్చు..
జస్టిస్ విక్రమ్ నాథ్…: ‘ఎన్ని బిల్లుల్ని పెండింగ్ లో ఉంచినా, ఆమోదించినా దేశం గత 75 ఏళ్లుగా పనిచేస్తూనే ఉంది..’