కాల్పుల్లో చనిపోయిన ట్రంప్ సన్నిహితుడు ఛార్లీ కిర్క్(Kirk)కు భారత్ అంటే విద్వేషం. 18 ఏళ్లకే ‘టర్నింగ్ పాయింట్ USA’ను స్థాపించాడు. వలసలు, గర్భస్రావాలు, జాతి, తుపాకీ నియంత్రణపై ప్రసంగించడంలో దిట్ట. భారత నిపుణులపై నోరు పారేసుకునేవాడు. ‘భారత్ నుంచి వచ్చిన వారిలాగా వలసలు అమెరికన్లను ఏమీ చేయలేవు.. ఇండియన్స్ కు మరిన్ని వీసాలివ్వడం అవసరం లేదు.. మనమే భారీగా ఉన్నాం.. సొంత ప్రజలను ముందుంచుకుందాం’ అని ఈనెల 2న ‘ఎక్స్(X)’లో పోస్ట్ చేశాడు. భారత్ తో డీల్ కుదిరితే H-1B వీసాల్ని ఇవ్వాల్సి వస్తుందనేవాడు.