వరదలు, కరెంటు కోతలు, ధరలతో అల్లాడే ప్రజలు ఒకవైపు.. లగ్జరీ కార్లు, ఖరీదైన డిజైనర్ డ్రెస్సులు, విదేశాల భోజనం పొందే నేతల పిల్లలు ఇంకోవైపు.. అందుకే నేపాల్ అగ్ని గుండమైంది. ‘నెపో కిడ్స్ లగ్జరీ జీవితాల వీడియోలు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, రెడిట్, ఎక్స్(X)ల్లో వ్యాపించాయి. ‘నెపో బేబీ నేపాల్’, ‘నెపో బేబీస్’ హ్యాష్ ట్యాగ్ లు దుమారం రేపాయి. పోఖరా ఎయిర్ పోర్టు నిర్మాణంలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందని తేలింది. నేపాల్ ఆసియాలోనే అత్యంత అవినీతి దేశమని ట్రాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది.
వారెవరి పిల్లలంటే…
@ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా కోడలు, సింగర్ శివనా శ్రేష్ఠ… ఖరీదైన ఇళ్లు, ఫ్యాషన్ పోకడలు భారీ స్థాయిలో ఖర్చు
@ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి బిరోద్ కుమార్తె, 29 ఏళ్ల మాజీ మిస్ నేపాల్ శృంఖల ఖతివాడ… విదేశీ ప్రయాణాలు, ఖరీదైన నివాసాలు, లగ్జరీ లైఫ్ స్టైల్
@ కమ్యూనిస్టు పార్టీ లీడర్ పుష్పకమల్ దహల్(ప్రచండ) మనవరాలు స్మిత… లక్షల విలువైన హ్యాండ్ బ్యాగులు, అత్యంత విలువైన కార్లు
@ న్యాయశాఖ మంత్రి బిందుకుమార్ థాపా తనయుడు సౌగత్… విలాసవంత పోకడలు, విదేశీ ప్రయాణాలు, భారీ భవంతులు