మూడు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల్ని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. పట్నా(Patna), మేఘాలయ, మణిపూర్ హైకోర్టులకు CJలను రికమెండ్ చేసింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.బి.బజంత్రికి పట్నా, కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమెన్ సేన్ కు మేఘాలయ, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సుందర్ కు మణిపూర్ హైకోర్టు CJలుగా బాధ్యతలు కట్టబెట్టనుంది. వీటిని కేంద్రం ఆమోదించాక రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.