చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Murmu) ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కీలక నేతలంతా హాజరయ్యారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్లతో గెలుపొందారు. రాధాకృష్ణన్ కు 452, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్ తర్వాత తమిళనాడు నుంచి ఉపరాష్ట్రపతి అయిన మూడో వ్యక్తి ఆయనే.