‘నానో బనానా’ ట్రెండ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. గత నెలలో విడుదలై కొద్దిరోజుల్లోనే 10 మిలియన్ల డౌన్లోడ్ లు దాటింది. స్పీడ్ గా ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ చేస్తుంది. గూగుల్ జెమినీ యాప్ లో ఒక భాగం.. అప్డేటెడ్ టూల్ ‘నానో బనానా'(Nano Banana). నెటిజన్లు పెట్టిన ఫన్నీ డాక్ నేమ్ ఇది. ఏ ఫొటోల్నైనా అత్యంత వాస్తవికతలా 3Dగా మారుస్తుంది. ఇది ఫ్రీగా అందుబాటులో ఉండగా, టెక్ నాలెడ్జ్ లేకున్నా వాడొచ్చు. డ్రెస్ లు, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్, బ్యాక్ గ్రౌండ్ అన్నీ నేచురల్ గా కనిపిస్తాయి. ఇప్పటికే 20 కోట్ల ఇమేజ్ లు సృష్టించిందని గూగుల్ తెలిపింది. ai.google.com వెళ్లి, గూగుల్ అకౌంట్ తో లాగిన్ అవ్వొచ్చు.