మొన్ననే చంద్రగ్రహణం పూర్తి కాగా.. ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతున్నది. ఈ పాక్షిక గ్రహణం(Eclipse) ఈ ఏడాదిలో చివరిది. 2025 సెప్టెంబరు 21 ఆదివారం(భారత కాలమానం ప్రకారం 22 నాడు) గ్రహణం సంభవిస్తుంది. కానీ అన్ని చోట్లా కనిపించదు. భానుణ్ని చంద్రుడు పాక్షికంగా కప్పివేయనుండగా పూర్తిగా చీకటి ఉండదు. అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో చూడొచ్చు. ఇది భారతదేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.