IPL ఫ్రాంచైజ్ పంజాబ్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 14న జరిగే భారత్-పాక్ మ్యాచ్ ను బాయ్ కాట్ చేసింది. భారత్ తదుపరి మ్యాచ్ అంటూ దాయాది పేరు లేని ఫొటోతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ‘దేశాల మధ్య క్రికెట్ అంటే స్నేహం, సామరస్యం చూపేది.. పహల్గామ్ దాడిలో మన ప్రజలు మరణించారు.. సైనికుల ప్రాణాల్ని పణంగా పెడుతున్నందున ఉగ్రవాదుల్ని పోషించే దేశంతో క్రికెట్ ఆడే మెసేజ్ సరైంది కాదు.. ఇది బాధిత కుటుంబాల మనోభావాలు దెబ్బతీస్తుంది..’ అని స్పష్టం చేసింది. మ్యాచ్ రద్దు చేయాలంటూ కొందరు వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించింది.