నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని సుశీల కర్కికి భారత్ తో అనుబంధం ఉంది. సుప్రీం తొలి మహిళా మాజీ CJ కర్కి.. అవినీతిరహిత దేశాన్ని కాంక్షించారు. అందుకే ఆమెనే ప్రధాని పదవికి పట్టుబట్టారు. వారణాసి బనారస్ హిందూ యూనివర్సిటీ(BHU)లో 1975లో పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ చేశారు. అవినీతి వాచ్ డాగ్ చీఫ్ నియామకం చెల్లదన్న తీర్పుతో ఆమెను తొలగించేందుకు అప్పటి నేపాలీ కాంగ్రెస్-CPN ప్రభుత్వం.. తీర్మానం పెట్టి కర్కిని సస్పెండ్ చేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురై విరమించుకుంది.
వారణాసిలోనే దుర్గాప్రసాద్ సుబేదితో పరిచయమై పెళ్లికి దారితీసింది. 1973 జూన్ 10న 3.5 కోట్ల నేపాలీ రూపాయల్ని తరలిస్తున్న విమానాన్ని హైజాక్ చేసిన వారిలో సుబేది ఒకరు. బిహార్ లో ల్యాండయ్యాక డబ్బుల్ని దించి తిరిగి టేకాఫ్ చేయించారు. 4 పర్యాయాల ప్రధాని గిరిజాప్రసాద్ కొయిరాలాకే ఆ డబ్బు ముట్టింది. కానీ ఏడాదిలోనే సుబేదిని అరెస్టు చేసిన భారత్.. రెండేళ్ల శిక్ష తర్వాత నేపాల్ పంపించింది.