4 దశాబ్దాల మావోయిస్టు నేత పోతుల పద్మావతి అలియాస్ సుజాత(62) లొంగిపోయారు. అనారోగ్య కారణాల రీత్యా లొంగిపోయినట్లు DGP జితేందర్ తెలిపారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ సుజాత స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు. సుజాతకు రూ.25 లక్షల రివార్డు అందిస్తామని DGP తెలిపారు. సెంట్రల్ కమిటీ మెంబర్, బెంగాల్ స్టేట్ కమిటీ కార్యదర్శి కిషన్ జీని 1984లో పెళ్లి చేసుకున్నారు. గ్రామ పోస్టుమాస్టర్ కూతురైన ఆమె.. 1982 సీపీఐ(ఎంఎల్)లో చేరారు. RSU, జననాట్య మండలిలో పనిచేసి 2001లో రాష్ట్రకమిటీ సభ్యురాలయ్యారు. 2011 నవంబరు 24న జరిగిన కాల్పుల్లో ఆమె భర్త చనిపోయారు.