ఈరోజు రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో భారీ నుంచి అతిభారీ(Very Heavy) వానలుండే 4 జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డికి ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఇక భారీ వర్షాలుండే కుమురం భీమ్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాలకు ‘యెల్లో అలర్ట్’ ఇచ్చింది. మొత్తంగా రేపు పొద్దున 8:30 వరకు ఈ 16 జిల్లాల్లో వర్షాలు ఉండనున్నాయి.