ఆమెకు ఈమధ్యే వందేళ్లు దాటాయి.. అయినా.. వారంలో 3 రోజులు జిమ్, నచ్చితే ఐస్ క్రీం, ఇష్టమైన ఫుడ్ తినడం.. ఇవీ ఆ బామ్మ ఆరోగ్య సూత్రాలు. ‘కదులుతూనే ఉండండి.. అడుగులేయండి’ అంటారు అమెరికా పెన్సిల్వేనియా వాసి మేరీ కరోనియస్(Coroneos). మైనింగ్ ప్రాంతంలో పుట్టి పెద్దగా డబ్బు లేకున్నా ఏనాడూ చింతించలేదు. తల్లికి సాయపడటం, అడవి అంతా తిరగడం అలవాటైంది. తోబుట్టువులతో ఇంటిపనుల్నే ఒక ఆటలాగా భావించేవారట.
హైస్కూల్ రోజుల్లో వాలీబాల్, బాస్కెట్ బాల్ అథ్లెట్. 70 ఏళ్ల వరకు ఫుల్ టైమ్, 90 వచ్చేదాకా పార్ట్ టైం టీచర్ గా పనిచేశారు. ఫుల్ టైమర్ గా చేస్తూనే మరోచోట పార్ట్ టైం జాబ్ చేసేవారు. మంచి విషయాల్ని ఆస్వాదించడం, నిరంతర వ్యాయామంతోపాటు శారీరక చురుకుదనం, మెదడుకు పని ఉండాలంటారు కరోనియస్. జిమ్ లో డంబెల్స్ ఎత్తడం చూసి ట్రెయినర్లే ఆశ్చర్యపోతారు.