గృహ కొనుగోలుదారుల కోసం సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలిచ్చింది. 20% చెల్లించాక రెవెన్యూ అధికారులతో రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది. ప్రతి ప్రాజెక్టులో ఇదే విధానాన్ని పాటించాలని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్.మహదేవ్ బెంచ్.. కేంద్రాన్ని ఆదేశించింది. మోసం/దోపిడీకి వీలులేని రూల్స్ తయారు చేయాలని, అది రాజ్యాంగపర విధి అని గుర్తుచేసింది. ఇబ్బందుల్లో ఉన్న ప్రాజెక్టులకు ఆదుకునేలా ‘పునరుజ్జీవన నిధి’ని పరిశీలించాలని సూచించింది. https://justpostnews.com
ప్రజల ‘కలల ఇల్లు’ చెరిగిపోకూడదని, పెట్టుబడులు నిర్వీర్యం కావొద్దని గుర్తు చేసింది. భూమి సేకరించని, ప్రారంభ దశలోని, నిర్మాణం పూర్తికాని ప్రాజెక్టుల్లో.. సేకరించిన డబ్బును ‘ఎస్క్రో ఖాతా’లో ఉంచి, పురోగతిని బట్టి దశలవారీగా ‘రెరా’ మంజూరు చేయాలని స్పష్టతనిచ్చింది. కఠిన చర్యల కోసం ‘రెరా’కు అధికారాలు, ట్రైబ్యునళ్లు ఉండాలని స్పష్టం చేసింది.