సభలకు రాని MLAలకు ‘నో వర్క్ నో ‘పే’ ఉండొద్దా అంటూ AP శాసనసభ స్పీకర్ సి.హెచ్. అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తిరుపతి జాతీయ మహిళా సాధికారత సదస్సులో ఏమన్నారంటే… ‘శాసనసభాపతిగా ఒక ప్రశ్న వేధిస్తోంది.. లోక్ సభ స్పీకర్ ఎదుట నా బాధ వ్యక్తం చేస్తున్నా.. మనసు విప్పి మాట్లాడతా ఈరోజు.. చిరుద్యోగులకు నో వర్క్ నో పే ఉంటుంది.. MLAలకది వర్తించదా.. వాళ్లు అసెంబ్లీకి రావట్లే.. సమస్యలు పరిష్కరిస్తారని ఎన్నుకుంటే సభకు రారా.. బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా.. ఒక ఉద్యోగి రాకుండా సస్పెండ్ చేస్తారు.. MLAలకు లేదా అండి..’.