భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు ముందు దుబాయ్(Dubai) గట్టి వార్నింగ్ ఇచ్చింది. బాయ్ కాట్లు, నిరసనల పేరుతో హడావుడి చేస్తే భారీ జరిమానాతోపాటు జైలుకెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఈ గ్రూప్-A రౌండ్ లో గెలిచే జట్టు సూపర్-4కు క్వాలిఫై అయ్యే అవకాశముంది. హైవోల్టేజ్ మ్యాచ్ లో ఎలాంటి గొడవలు, ఘర్షణలు జరిగినా లక్ష నుంచి రూ.7 లక్షల దాకా ఫైన్, పరిమితి దాటితే నేరుగా జైలుకు వెళ్లడమేనని దుబాయి ప్రభుత్వం హెచ్చరించింది. ఇప్పటికే స్టేడియంతోపాటు పరిసరాల్లో భారీ భద్రతను పెట్టింది.