రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ జంట నగరాల్లో(Twin Cities)నూ పెద్దయెత్తున వర్షపాతాలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తాటిఅన్నారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 12.7 సెం.మీ. నమోదైంది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో 12.1, మారేడుపల్లిలో 9.5, షేక్ పేట్ లో 9.4, కాప్రాలో 9.1 సెం.మీ. వర్షం పడింది. ఇక పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతోపాటు నిరంతరాయంగా వానలు పడుతున్నాయి.