తొలుత అభిషేక్ శర్మ(31; 13 బంతుల్లో 4×4, 2×6) వీరబాదుడు.. తర్వాత తిలక్ వర్మ(31), సూర్యకుమార్(47 నాటౌట్; 37 బంతుల్లో 5×4, 1×6) నిలకడ.. అన్ని రంగాల్లో రాణించి ఆల్ రౌండ్ షో చూపిన భారత్.. పాకిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది. మొదట పాక్ 127/9 చేస్తే, అనంతరం లక్ష్యాన్ని టీమ్ఇండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ ఉన్నంతసేపూ ఓవర్ కు 10 రన్ రేట్ తో పరుగుల వరద పారింది. తిలక్ ఔటైనా.. సూర్య, దూబె(10 నాటౌట్) జోడి లాంఛనాన్ని పూర్తి చేసింది. 15.5 ఓవర్లలో 131/3 తో నిలిచి 7 వికెట్ల తేడాతో భారతజట్టు విజయతిలకాన్ని దిద్దుకుంది.