వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పునిచ్చింది. మొత్తం చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది. సెక్షన్ 3(1)(r)లోని రూల్ ప్రకారం ఒక వ్యక్తి వక్ఫ్ కోసం ఐదేళ్లు ఇస్లాంలో ఉండాలనే నిబంధనపై CJI గవాయ్, జస్టిస్ ఎ.జి.మసీహ్ బెంచ్ స్టే ఇచ్చింది. ప్రభుత్వాలు నియమాల్ని రూపొందించాలన్న అంశాన్ని నిలిపివేసింది. ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించారా లేదా అనేదానిపై అధికారి(కలెక్టర్)ను అనుమతించడంపై స్టే ఇచ్చింది.
పౌరుల వ్యక్తిగత హక్కులపై తీర్పు చెప్పే అధికారం వారికి లేదంటూ ముస్లిమేతరుల సంఖ్యపై పరిమితి విధించింది. బోర్డ్ ఎక్స్-అఫీషియో సభ్యుడు ముస్లిం అయి ఉండాలని, కేంద్ర కౌన్సిల్ లో 4 కన్నా.. రాష్ట్ర బోర్డులో 3 కంటే ఎక్కువ మంది ముస్లిమేతరులు ఉండరాదని స్పష్టం చేసింది. మొత్తం చట్టాన్ని నిలిపేయడానికి ఆధారాలు లేవని తీర్పు ఇచ్చింది.