
పాక్ ప్లేయర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై ఆ దేశ ICC డైరెక్టర్ ఉస్మాన్ వాలాను PCB సస్పెండ్ చేసింది. రూల్స్ ను టీమ్ఇండియా అతిక్రమించిందని, ఈ విషయాన్ని సకాలంలో మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకుపోలేదంటూ వేటు వేసింది. విన్నింగ్ షాట్ తర్వాత భారత ఆటగాళ్లంతా డ్రెస్సింగ్ రూంకు వెళ్లిపోయారు. అక్కడకు వెళ్లినా డోర్ మూసి ఉండటంతో పాక్ కెప్టెన్ సల్మాన్, కోచ్ మైక్ హెసన్ వెనుదిరిగారు. దీనిపై కోచ్ తీవ్ర నిరాశకు గురికాగా.. క్రీడాస్ఫూర్తి ప్రదర్శించని భారత్ పై చర్యలకు ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ డైరెక్టర్ ను సస్పెండ్ చేసింది. పహల్గామ్ దాడి బాధితులకు సంఘీభావంగా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.