
గెలిస్తేనే ఫైనల్ చేరుకునే మ్యాచ్ లో పాకిస్థాన్ కుప్పకూలింది. ఆసియా కప్ లో బంగ్లా బౌలర్ల దెబ్బకు వెంటవెంటనే వికెట్లు కోల్పోయి విలవిల్లాడింది. 71కే ఆరు వికెట్లు కోల్పోయిన జట్టును మహ్మద్ హారిస్(31) ఆదుకున్నాడు. ఫర్హాన్(4), ఫకర్(13), సయీం(0), ఆఘా(19), తలత్(3), అఫ్రిది(19) ఇలా వచ్చి అలా వెళ్లారు. టస్కిన్ అహ్మద్ 3, మెహదీ హసన్, రిషాద్ హుస్సేన్ రెండేసి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ఈ ముగ్గురి దెబ్బకు పాకిస్థాన్ 134 స్కోరుకే పరిమితమైంది.