మోదీ సర్కారు కొరకరాని కొయ్యలా మారిందని భావిస్తున్న విపక్ష కూటమి I.N.D.I.A… మరింత ఒత్తిడి పెంచాలన్న లక్ష్యంతో అడుగేస్తోంది. ఇప్పటికే మణిపూర్ అంశంపై ప్రకటనకు పట్టుబడుతున్న విపక్ష పార్టీలు.. ఇప్పుడు మరో తీర్మానానికి సిద్ధమయ్యాయి. BJP ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించాయి. పార్లమెంటు హౌజ్ లోని మలికార్జున ఖర్గే ఛాంబర్ లో సమావేశమైన కూటమి పార్టీల MPలు.. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న అంశంపై మూకుమ్మడిగా సమ్మతి తెలిపారు.
ఈ రోజు పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు భేటీ అయిన ప్రతిపక్ష MPలు ముక్తకంఠంతో అవిశ్వాస తీర్మానంపై నిర్ణయానికి వచ్చారు. ఆగస్టు 11 వరకు సమావేశాలు ఉన్నందున ఈ వారం లేదా, వచ్చే వారంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. తమకు ఉన్న బలం, ఇంకా కలిసి వచ్చే పార్టీల మద్దతు గురించి చర్చలు జరుగుతున్నాయి. పార్లమెంటులో లేవనెత్తే అంశాలపైనా ఏ మాత్రం తగ్గకూడదని నిర్ణయించారు.