
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ(61) దెబ్బకు శ్రీలంక(Sri Lanka) షేక్ అయింది. అతడి పరుగుల స్పీడ్ ఎలా ఉంటుందో ప్రత్యర్థి మరోసారి కళ్లారా తిలకించింది. నామమాత్రమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో ఓవర్లలోనే గిల్(4) ఔటయ్యాడు. ఒకవైపు సూర్య నిదానంగా ఆడుతుంటే మరో ఎండ్ లో అభిషేక్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. 22 బంతుల్లోనే అతడు 7 ఫోర్లు, 2 సిక్సులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.