
BC రిజర్వేషన్ల అంశంపై రేపు హైకోర్టులో విచారణ ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు CM రేవంత్ తో ముఖ్య నేతలు భేటీ అయ్యారు. దీనిపై పిటిషన్ ను ఇప్పటికే సుప్రీంకోర్టు నిరాకరించగా.. రేపు హైకోర్టులో జరిగే విచారణపై ఉత్కంఠ ఏర్పడింది. వాదనల కోసం అభిషేక్ సింఘ్విని రంగంలోకి దింపుతున్నారు. హైకోర్టులో వాదించాలంటూ సింఘ్విని CM కోరగా.. ఉప ముఖ్యమంత్రి సైతం ఆయన్ను కలిశారు. భట్టి విక్రమార్క, PCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ సహా పలువురు మంత్రులు, పార్టీ పెద్దలు CMతో చర్చలు జరుపుతున్నారు.