
వెస్టిండీస్(West Indies)తో రెండో టెస్టులోనూ భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేయగా, సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ మొదట్నుంచీ దూకుడు చూపించాడు. అతడు 145 బంతుల్లో 16 ఫోర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో ఓపెనర్ రాహుల్(38) స్టంపౌటైనా లెఫ్ట్ హ్యాండర్ల జోరు ఆగలేదు. రెండో వికెట్ భాగస్వామ్యం 140 పరుగులు దాటింది. ప్రస్తుతానికి టీమ్ఇండియా 200/1తో పటిష్ఠ స్థితిలో ఉంది.