
సీనియర్లు రోహిత్, విరాట్ ఫామ్ లోకొచ్చారు. హిట్ మ్యాన్ సెంచరీ పూర్తి చేసుకోగా, కోహ్లి హాఫ్ సెంచరీ దాటాడు. ఈ ఇద్దరి స్టాండింగ్ తో భారత్ గెలుపు బాట సులువైంది. రోహిత్(100 నాటౌట్; 105 బంతుల్లో 11×4, 2×6) వంద పూర్తి చేశాడు. ఇక కోహ్లి సైతం ఫిఫ్టీ దాటి సరికొత్త రికార్డ్ సాధించాడు. అత్యధిక పరుగుల్లో సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. గిల్(24) ఔటైనా సీనియర్ జోడీ 140కి పైగా పార్ట్నర్ షిప్ అందించింది.