
డ్రైవింగ్ విషయంలో అబుదాబి(Abudhabi) పోలీసులు కఠిన రూల్స్ తెస్తున్నారు. 21 ఏళ్లలోపు వారు బండి నడిపితే లైసెన్స్ రద్దు చేసి రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలిస్తారు. బ్లాక్ పాయింట్లను UAE ఫెడరల్ ట్రాఫిక్ ఫ్రేమ్ వర్క్ తయారు చేసింది. స్పీడ్ డ్రైవింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడం నేరం. రెడ్ లైట్ దాటితే 12, ఇతరులకు ప్రమాదం కల్పిస్తే 23 పాయింట్లు వేస్తారు. దీంతో అక్కడ డ్రైవింగ్ చేయాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఏడాది కాలంలో 24 పాయింట్లు దాటితే లైసెన్స్ సస్పెండవుతుంది. 24 పాయింట్లకు చేరువగా వచ్చిన వారికి సహాయం అందిస్తారు. 8 నుంచి 23 పాయింట్లు చేరుకున్నాక అలర్ట్ చేసి వారి పాయింట్లు తగ్గేలా ట్రైనింగ్ ఇస్తారు. ప్రత్యేక కేంద్రంలో ఉండటం, పునరావాస కోర్సు చేయడం, 800 దిర్హమ్స్ చెల్లించడం వంటి వెసులుబాట్లు ఉంటాయి.