
దేశ ఆస్తుల్ని కాపాడటానికి RBI చర్యలు చేపట్టింది. విదేశాల్లో దాచిన 64 టన్నుల బంగారాన్ని 6 నెలల్లో దేశానికి రప్పించింది. విదేశీ ఖజానాల విశ్వసనీయతపై అపనమ్మకం ఏర్పడటంతో RBI ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అఫ్గాన్ ను తాలిబన్లు ఆక్రమించడం ఇందుకు ఉదాహరణలు. ఈ రెండు సందర్భాల్లో బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వల్ని స్వదేశానికి తెప్పించింది. ఒక దేశంతో రాజకీయ విభేదాలున్న పరిస్థితుల్లో మన సొంత డబ్బునే మనకు అవి వ్యతిరేకంగా వాడుకోవచ్చు. దేశ సురక్షిత ఆస్తిగా భావించే బంగారాన్ని అటువంటి పరిస్థితుల్లో సొంత ఖజానాల్లో ఉంచుకోవడం ఉత్తమమైన పని. 2023 మార్చి నుంచి భారత్ కు మొత్తం 274 టన్నుల పుత్తడిని తీసుకువచ్చింది. 2025 సెప్టెంబరు నాటికి 880.8 టన్నుల బంగారాన్ని RBI కలిగి ఉంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద 290.3 టన్నుల బంగారం ఉంది.