
సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ప్యారడైజ్ నుంచి సుచిత్ర వరకు కారిడార్ నిర్మాణం కానుండగా, వాహనాల్ని ఎక్కడికక్కడ
దారి మళ్లించారు. ఈ ట్రాఫిక్ డైవర్షన్ 9 నెలలపాటు ఉంటుంది. బాలంరాయి జంక్షన్ నుంచి జగ్జీవన్ రామ్ జంక్షన్ వరకు రోడ్డు మూసివేశారు. బాలానగర్, బోయిన్ పల్లి, సుచిత్ర దారిలోని వాహనాల్ని దారి
మళ్లించారు. పంజాగుట్ట, ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలు SBI కూడలి వైపు పంపిస్తున్నారు. తాడ్ బండ్ వైపు వెళ్లే వాటిని అన్నానగర్ మీదుగా, సికింద్రాబాద్ టివోలి(Tivoli) థియేటర్ ప్రాంతంలోని
రోడ్లలోనూ దారి మళ్లింపు జరుగుతోంది