
మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. లిచ్ ఫీల్డ్(119; 93 బంతుల్లో 17×4, 3×6), ఎలిసే పెర్రీ(77), గార్నర్(63)తో ఆ జట్టు పెద్ద స్కోరు సాధించింది. భారత బౌలర్లు తొందరగా వికెట్లు పడగొట్టలేకపోయారు. ముందునుంచీ కంగారూ జట్టు మహిళల ఆధిపత్యం కొనసాగింది. కానీ చివర్లో వికెట్లు పడటంతో 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌటైంది. శ్రీచరణి, దీప్తి రెండేసి చొప్పున.. క్రాంతి గౌడ్, అమన్ జోత్ కౌర్, రాధాయాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. భారత్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది.