
మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్(Azharuddin) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. 2023లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన
అజహర్, గవర్నర్ కోటాలో MLCగా నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి 2009లో UPలోని మొరాదాబాద్ నుంచి MPగా తొలిసారిగా పోటీచేసి గెలిచారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ MP స్థానంలో ఓడిపోయారు. ఈ కేబినెట్ లో మూడు బెర్తులు ఖాళీగా ఉండగా, అజహర్ ప్రస్తుతం ఒకే ఒక మంత్రి ప్రమాణం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత ఎన్నికల్లో BRS పాగా వేసింది. ఈ రెండింటితోపాటు జూబ్లీహిల్స్ ఎన్నికల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కడం చర్చనీయాంశమైంది.