
అజహరుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించిన వేళ దాన్ని ఆశించి నిరాశపడ్డ సీనియర్ నేతలకు కీలక పదవులు దక్కాయి. MLA ప్రేమ్ సాగర్ రావును పౌరసరఫరాల(Civil Supplies) సంస్థ ఛైర్మన్ గా,
బోధన్ MLA పి.సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ ఇద్దరికీ కేబినెట్ హోదాతో అధికారాలు దక్కుతాయి. కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడుగానూ సుదర్శన్ రెడ్డి
ఉంటారని ప్రభుత్వం తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మూడు బెర్తుల కోసం ఈ సీనియర్ నేతలిద్దరూ ముందువరుసలో ఉన్నారు. మంత్రిగా అజహర్ ప్రమాణం చేయగా, మిగతా వారిని బుజ్జగించే ప్రయత్నంలో కీలక పోస్టులు కట్టబెట్టారన్న చర్చ నడుస్తోంది.