
అభిషేక్(Abhishek) మినహా ఎవరూ నిలబడకపోవడంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. పేస్ బౌలర్ హర్షిత్ రాణా(35) మాత్రమే అతడికి అండగా నిలిచాడు. చివరకు అభిషేక్(68; 37 బంతుల్లో 8×4, 2×6) ఔటవడంతో ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టీమ్ఇండియా ఆలౌటైంది. సంజూ(2), సూర్య(1), తిలక్(0), అక్షర్(7), దూబె(4) ఇలా వచ్చి అలా వెళ్లారు. 18.4 ఓవర్లలో భారత్ 125 స్కోరు చేసింది. హేజిల్ వుడ్ 3, బార్ట్ లెట్, ఎలిస్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.