
నిబంధనలు ఉల్లంఘిస్తే పెనాల్టీ(Penalty)లు, కఠిన చర్యలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనాల స్పీడ్ లాక్ పై దృష్టిపెట్టాలంటూ రవాణా శాఖను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఉన్నతాధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించిన ఆయన… డస్ట్, ఇసుక తీసుకెళ్లే టిప్పర్ లారీలు టార్పాలిన్ కవర్లు కప్పుకోవాలన్నారు. DTC, RTOలు ఒక్కో జిల్లాకు మూడు టీంలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లు, హైర్ బస్సుల ఫిట్నెస్ పై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, అలా చేస్తేనే ప్రమాదాన్ని అరికట్టగలుగుతామని స్పష్టం చేశారు. చేవెళ్ల సమీపంలో ప్రమాదం జరిగిన రెండు వాహనాలకు ఫిట్నెస్ ఉన్నప్పటికీ ఇరుకు రోడ్డుపై డివైడర్ లేకపోవడం వల్లే దుర్ఘటన జరిగిందన్నారు.