
పెరిగినట్లే పెరిగి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. గత 19 రోజుల్లో రూ.11,000 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,460గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,250 పలికింది. వెండి కిలో రూ.1,65,000గా ఉంది. గత కొద్దిరోజులుగా పుత్తడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. నిన్న రూ.1,23,170గా ఉండగా, ఈరోజు రూ.710 తగ్గింది. 22 క్యారెట్లకు సైతం సోమవారం రూ.1,12,900కు గాను ఇవాళ రూ.650 దిగివచ్చి రూ.1,12,250కి చేరింది. వెండి నిన్న రూ.1,68,000 పలికితే ఈరోజు రూ.3,000 తగ్గి రూ.1,65,000 అయింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల విషయంలో ఏర్పడ అనిశ్చితితో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.