
బ్యాంకుల్లో స్థానిక భాష అమలయ్యేలా చూడాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సూచించారు. ఇందుకోసం HR విధానాలను సర్దుబాటు చేయాలన్నారు. కస్టమర్లకు అందించే సేవల ద్వారా మానవ సంబంధాలు తిరిగి తీసుకురావాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక బ్యాంకుల్లో కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. బ్యాంకు మేనేజర్ కన్నడం మాట్లాడకపోవడంతో గొడవ జరిగింది. అక్కడి CM స్పందించి ఆ మేనేజర్ ను బదిలీ చేయించారు.
దేశంలో ఇలాంటివి జరగకుండా చూడాలని నిర్మల కోరారు. అలా జరగకపోతే ప్రతీది డిజిటల్ గానే మారి ఆన్ లైన్ ద్వారానే వినియోగదారులను చేరుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల సిబ్బంది లోకల్ లాంగ్వేజీలతో ఇబ్బంది పడుతుండటం, కమ్యూనికేషన్ లోపం వల్ల కస్టమర్ల ఆగ్రహానికి గురవుతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నామంటూ ఆమె గత ఘటనలు గుర్తు చేశారు.